ఈ మధ్య థియేటర్లకి వెళ్తే... ఫస్ట్ హాఫ్‌లో ఎందుకు చంపారో తెలియదు, సెకండ్ హాఫ్‌లో ఎందుకు తన్నులు తింటున్నారో అర్థం కాదు. ‘క్రింజ్ కమర్షియల్ ఫార్ములాలు’ విరబూసి, రక్తపాతం జాతరలా సాగుతున్న నేటి సినిమా ప్రవాహంలో... ‘రావు బహద్దూర్’ ఒక వింతైన, వెర్రి మ్యాజిక్‌లా మన ముందుకొచ్చింది.
సినిమా మొదలవ్వడమే గోడ నిండా పాతకాలపు రాజుల పోర్ట్రైట్లతో మొదలవుతుంది. కెమెరా అలా వెనక్కి లాగేసరికి ఆ ఫ్రేములన్నీ కలిసి ఒకే ఫ్రేమ్‌లా అనిపిస్తాయి. అంటే... సమాజం అనే ‘కలెక్టివ్ గ్యాంగ్’ ఒక ఇండివిడ్యువల్ మనిషి బ్రెయిన్ ని ఎలా కండిషన్ చేసి, పితృస్వామ్య కట్టుబాట్ల 'పంజరం'లో బంధిస్తుందో చెప్పడానికి ఇంతకంటే విజువల్ స్క్రీన్‌ప్లే మరొకటి ఉండదు.
రామప్ప రావు బహద్దూర్... పేరులోనే ఒక పాతకాలపు ఇత్తడి గిన్నెలాంటి రాజసం ఉట్టిపడుతుంది. అయితే, ఈ బహద్దూర్ చుట్టూ కాలం ఒక విచిత్రమైన డెడ్‌లైన్ గీస్తుంది. ఆ గీతని చూసి సామాన్యుడైతే భయపడి కూలబడిపోతాడు, కానీ మనోడు మాత్రం ఆ డెడ్‌లైన్ మేధస్సుకే ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ, 'నువ్వు కాసేపు వెయిట్ చెయ్, నా స్క్రీన్‌ప్లే ఇంకా అవ్వలేదు' అని కాలంతో నెగ్గుకుంటూ ఉంటాడు.
అతని పక్కనే నిరంతరం కనిపెట్టుకుని ఉండే స్నేహితుడు డాక్టర్ ఆచారి. వీళ్ళిద్దరి కాంబినేషన్ చూస్తుంటే... మన కిచెన్ కేబినెట్‌లో ఎప్పుడూ వాడకుండా దాచిపెట్టే ఒక వింటేజ్ ఇత్తడి సామగ్రి, దాని పక్కనే ఉన్న మోడర్న్ డిష్‌వాషర్ లాంటి ప్రాక్టికాలిటీ పక్కపక్కనే కూర్చుని లోతైన ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టు ఉంటుంది. ఆ రాజభవనపు గోడల వెనుక వీళ్ళు ఆడే ఆ మైండ్ గేమ్స్, ఆ నిశ్శబ్దం... ఒక రేంజ్‌లో మనల్ని లాక్ చేస్తాయి.
కానీ, అసలు మ్యాజిక్ ఎక్కడ మొదలవుతుందంటే... ఆ రాజసం ఉట్టిపడే బహద్దూర్ గారి బుర్రలోకి ఒక ‘అనుమానపు పురుగు’ ప్రవేశిస్తుంది! ఆ పురుగు లోపలికి వెళ్ళాక, అది అతని ఆలోచనలని, అతని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా తొలచివేస్తుందో చూపించిన తీరు అద్భుతం. ఒక చిన్న అనుమానం మనిషి మనస్తత్వాన్ని ఎలా మార్చేస్తుంది, ఆ జనరేషనల్ ట్రామా ఎలా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్‌ఫర్ అవుతుందో స్క్రీన్ మీద ఆవిష్కరించిన విధానం మైండ్ బ్లాక్ చేస్తుంది.
ఈ కథనంలో అత్యంత అద్భుతమైన ప్రయోగం ఏంటంటే... సినిమాలో కొన్ని ముఖ్యమైన డైలాగులు, పేర్లని దర్శకుడు కావాలనే 'మ్యూట్' చేసేశాడు. థియేటర్లో కూర్చుని, 'అరే.. ఆ వాయిస్ ఎందుకు రావట్లేదు?' అని మనం ఇబ్బంది పడుతుంటే... ఆ మ్యూట్ వెనుక ఉన్న థీమ్ అర్థమయ్యాక, అది సినిమా కథనానికి ఇచ్చిన లేయర్ చూసి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇదేదో లాస్ట్ లో హీరో వచ్చి మైక్ పట్టుకుని సమాజానికి పెద్ద లెక్చర్స్ ఇవ్వడం కాదు....కథనమనే ఝరిలో లీనమైపోవడం!
సత్యదేవ్ నటన గురించి మాట్లాడటం వేస్ట్... ఎందుకంటే అతను ఇందులో యాక్ట్ చేయలేదు, ఆ క్యారెక్టర్‌లోకి పూర్తిగా 'డిసాల్వ్' అయిపోయాడు. వయసుతో పాటు, ఆ అనుమానపు పురుగు వల్ల అతనిలో వచ్చే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తే... తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంత మంచి నటుడిని సరిగ్గా వాడుకోలేకపోతుందోనని ఒక గట్టి 'రియాలిటీ చెక్' ఇస్తుంది. ఒకవేళ సత్యదేవ్ ఇకముందు కూడా ఇలాంటి స్క్రిప్ట్స్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటే... టాలీవుడ్‌లో ఒక సరికొత్త 'మెగా తారా' పథానికి ఒక బలమైన పునాదిరాయి వెయ్యచ్చు!
ఈ సినిమా సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాలంటే... Smaran Sai ఒక అద్భుతమైన ప్రయోగం చేశాడు. ఇందులో అతిపెద్ద బలం... ఎక్కడ సౌండ్ ఇవ్వాలో తెలియడం కాదు, ఎక్కడ ఇవ్వకూడదో తెలియడం! సత్యదేవ్ బుర్రలోకి ఆ అనుమానపు పురుగు ప్రవేశించి లోపల తొలుస్తున్నప్పుడు... Smaran బ్యాక్‌గ్రౌండ్‌లో వాడిన ఆ 'నిశ్శబ్దం', దాని వెనుక చాలా సబ్‌ట్రెన్షియల్ గా వినిపించే ఒక వింత శబ్దం... థియేటర్ సీట్లోంచి మనల్ని కదలకుండా లాక్ చేసేస్తాయి. ఆ రాయల్ వింటేజ్ మూడ్‌కి, సడన్‌గా వచ్చే మోడర్న్ సింథ్ బీట్స్‌కి మధ్య స్మరన్ చేసిన ఈ సౌండ్ ఎక్స్‌పెరిమెంట్ సినిమా సోల్ ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.
హై-ఫై హంగుల మధ్య, లౌడ్ కమర్షియల్ ఫార్ములాల మధ్య ఒక ఒరిజినల్ సినిమాని శ్వాసించాలనుకునే ప్రతి 'మూవీ బఫ్' ఓపెన్ మైండ్‌తో వెళ్లి చూడాల్సిన సినిమా ఇది. చూస్తే పాత్రల అంతర్మథనం లోని లోతు అర్థమవుతుంది... లేదంటే, మన మైండ్‌ని సమాజం ఎలా కండిషన్ చేస్తుందో తెలియకుండా, ఆ పంజరంలోనే ఉండిపోయే ఒక అపురూపమైన వింతని మిస్ అయినట్టే!